HYD: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి, MLC బల్మూరి వెంకట్ శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషన్ సభ్యుల పదవి స్వీకరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మహిళల సంక్షేమం కోసం కమిషన్ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.