KNR: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 22న నిర్వహించే జిల్లా స్థాయి సభను విజయవంతం చేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతిపై శాఖల వారీగా పది నిమిషాల డాక్యుమెంటరీ సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.