అన్నమయ్య: పీలేరు అయ్యప్పనేని చెరువుకు సుందరీకరణ పనులు చేపట్టి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. పింఛా నది నుంచి 2.50 కి.మీ పైపులైన్ ద్వారా నీటి సరఫరా, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.