VSP: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అడ్డరోడ్డు జంక్షన్ ఇంఛార్జ్ ఆర్డీవో రమణ అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనం పశుసంవర్ధక శాఖ గ్రామీణ మంచినీటి సరఫరా, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.