BPT: పంగులూరు మండలంలోని భగవాన్ రాజుపాలెం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు నార్నే రాములమ్మ (103) గురువారం ఉదయం ఆరు గంటలకు మరణించారు. ఆమె కార్నియాలను ఆమె కుటుంబ సభ్యులు రోటరీ క్లబ్ బృందం సహకారంతో పెద్దకాకాని శంకర్ నేత్రాలయంకు అందజేశారు. శంకర్ నేత్రాలయ బృందం వైద్యులు డాక్టర్ పద్మావతి నాయకత్వంలో రాములమ్మ కార్నియాలను సేకరించి తీసుకువెళ్లారు.