PLD: వినుకొండ-చీకటీగలపాలెం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడికి సుమారు 50 ఏళ్ల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతుడు ఎరుపు రంగు అడ్డగీతల పూర్తి చేతుల చొక్కా, ఆకుపచ్చ లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని వినుకొండ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.