BDK: జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చుంచుపల్లి మండలం జీఎం ఆఫీస్ 3 ఇంక్లైన్లో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచ, దుమ్ముగూడెం, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.