SRPT: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్ డబ్ల్యూ ఎఫ్) రూపొందించిన విశ్లేషణాత్మక బుక్లెట్ను సూర్యాపేట డిపోలో ఆవిష్కరించారు. ఏపీలో అధ్యయనం చేసి దీనిని రూపొందించామని రీజియన్ కార్యదర్శి బి. సుధాకర్ తెలిపారు. హక్కుల రక్షణ, వేతన సవరణ సమస్యలను జూన్ 2 లోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.