HYD: మారేడ్పల్లి పీఎస్ పరిధిలోని వైఎంసీఏ బస్ స్టాప్ వద్ద బేగంపేట ‘షీ టీమ్’ ఆధ్వర్యంలో ఎల్ఈడీ వాహనం ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్స్ పనితీరు, సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలల వేధింపులు, రాగింగ్ నిరోధంపై ప్రజలకు, మహిళలకు సమగ్రంగా అవగాహన కల్పించారు.