JGL: కథలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపెల్లి గోపాల్ రెడ్డి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, తరుగు-తెమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని కోరారు.