కృష్ణా: గుడివాడలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో జిల్లా సర్వైలెన్స్ అధికారి డా. ఎ.సాయికిరణ్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. తహసీల్దార్ కిరణ్ కుమార్, వైద్యాధికారులతో కలిసి స్కానింగ్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డా.సాయికిరణ్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.