HYD: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సులు నిర్వహించారు. యూసీడీ, హెల్త్, ఎంటమాలజీ సిబ్బంది యువతకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకుంటూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.