MNCL: ప్రతి ధాన్యం బస్తాను గోదాముకు తరలించాలని దండేపల్లి మండల తాహసీల్దార్ రోహిత్, ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం మండలంలోని లింగాపూర్, కన్నేపల్లి గ్రామాలలో ఉన్న రైస్ మిల్లులను, గోదాములను సందర్శించారు. ధాన్యం బస్తాల లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వారు పరిశీలించారు. సకాలంలో బస్తాలను గోదాములకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు.