AP: రాష్ట్రంలోని రూ.1,990 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. నాలుగు కీలక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫండ్ ద్వారా మొత్తం రూ. 497.71 కోట్ల కేంద్ర సాయం మంజూరైంది. విశాఖ, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేన్లలో ప్రాజెక్టులను ఆమోదించింది.