CTR: పాలసముద్రం మండలం ఆముదాలలో ద్రౌపతి దేవి ధర్మరాజు ఆలయంలో మహాభారత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ద్రౌపదీ కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.