ATP: సత్యసాయి తాగునీటి సరఫరా బోర్డు అధికారులు, జేఏసీ నాయకులు మధ్య గురువారం జరిగిన చర్చలు సఫలం కావడంతో తాగునీటి కార్మికులు సమ్మెను విరమింపజేసి విధుల్లోకి చేరారు. ఇందులో భాగంగా గుత్తిలోని తాగునీటి పంపు హౌస్లో తాగునీటిని సరఫరా చేసే మోటార్లను ప్రారంభించారు. గత 17 రోజులుగా తాగు నీటి కార్మికుల సమ్మె చేయడంతో నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.