RR: TGSPDCL బలోపేతం దిశగా మరో కీలక ముందడుగు పడింది. కొత్తగా ప్రారంభించిన కందుకూర్ సబ్‌స్టేషన్ నుంచి రెండు కొత్త 33 కేవీ ఫీడర్లను విజయవంతంగా ఛార్జ్ చేశారు. దీంతో కందుకూర్, జైత్వారం, పులిమామిడి, నేదునూర్, కొత్తగూడ గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. ఫ్యాబ్ సిటీ ఈహెచ్టి సబ్‌స్టేషన్‌పై లోడ్ తగ్గడంతో పాటు ఫీడర్ పొడవులు కూడా తగ్గనున్నాయి.