PLD: రొంపిచర్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ సమీపంలోని రామాలయం వద్ద సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారామ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపుగా కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.