కరీంనగర్ నగరంలోని అలుగునూరు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పురస్కరించుకుని మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.