TG: కొత్తగా పాస్ బుక్ పొందిన రైతులు రైతు భరోసా కొరకు ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. అదే విధంగా రైతు భరోసా నిధుల జమ వివరాలు ఈనెల 21 వరకు మార్చుకోవచ్చని వెల్లడించారు. రైతు భరోసా కొత్త దరఖాస్తుదారులు ఆధార్, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ కాపీలను మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.