NDL: రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో,రాష్ట్ర షెడ్యూల్ కులాల SC కమిషన్ ఛైర్మన్ కె.ఎస్ జవహర్ మంగళవారం కలెక్టర్ రాజకుమారి గనియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కును బహుకరించి కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన చర్చలో, జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు.