కృష్ణా: పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా నివారణ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మలేరియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, దోమల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మలేరియా వ్యాధి దోమల కాటు ద్వారా వ్యాపిస్తుందని, జ్వరం, చలి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.