W.G: కేంద్రం తెచ్చిన విబిజీ-రామ్ జీ పథకాన్ని రద్దు చేసి, పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెనుగొండ (M) ఇలపర్రులో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కూలీలు నిరసన చేపట్టారు. పని దినాలు పెంచామని గొప్పలు చెప్పుకుంటూ నిధులు తగ్గించడం దారుణమన్నారు. ఫేస్ యాప్ను రద్దు చేసి పాత విధానాన్ని తీసుకురావాలని కార్మికులు డిమాండ్ చేశారు.