ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, తదితరులున్నారు.