GDWL: కొత్త ఏడాదిలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని అని కే.టి.దొడ్డి ఎస్సై శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, గురువారం ఆయన మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎస్సైకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.