TG: డ్రగ్స్ కల్చర్ మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తోందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి పనులు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.