సత్యసాయి: ప్రతి మనిషి తన శాశ్వత నివాసమైన సమాధి కోసం బ్రతికే ఉన్నప్పుడే సిద్ధం చేసుకోవాలని మౌలానా మహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. సోమందేపల్లిలోని జామియా మజీద్లో ఆదివారం ముస్లిం సోదరులు 25వ ఉపవాసాన్ని ఆచరించి ఫజర్ నమాజ్ నిర్వహించారు. అనంతరం ఖురాన్ బోధనలు చేశారు. ఈ సందర్భంగా ఐదు పూటల నమాజ్ చేయడంతో పాటు దానధర్మాలు చేసి సమాజానికి మంచి చేయాలని మౌలానా సూచించారు.