పాకిస్థాన్ గూఢచారి సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హైకోర్టులో చుక్కెదురైంది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని శత్రువులకు చేరవేసినట్లు ఆమెపై కేసులు ఉన్నాయి. ఈ నేరం దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తుందని భావించిన పంజాబ్ & హర్యానా హైకోర్టు, జ్యోతి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.