GDWL: శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఆదివారం ప్రిన్సిపల్ రామాఓబులేష్ బృందం ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని కోరారు. కళాశాలలో తాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన నేతలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.