NLG: సామాన్యుడి ఇంటిపై ఇక సౌర ఫలకలు మెరవనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ‘పీఎం సూర్యఘర్ ముఫ్ బిజిలీ ‘ పథకం ద్వారా గ్రామాల్లో ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిదశలో భాగంగా నల్గొండ జిల్లాలోని కనగల్, అనుముల, ముదిగొండ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.