AP: మొయినాబాద్(తెలంగాణ) డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్‌పై TDP చర్యలు తీసుకోవాలని YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు MPగా రాజీనామా చేయించాలన్నారు. ఈ కేసులో పట్టుబడ్డవారిపై ఉదాసీనత చూపకుండా, 2 రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ పోలీసులను కోరారు.