ASF: కాగజ్ నగర్ మండలం అందవెల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 16న SPM జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ కవిత రాజేందర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. శిబిరంలో వైద్యులు సాధారణ తనిఖీలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా సలహాలు అందిస్తారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.