కర్నూలులో రగ్బీ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఇందులో కోసిగి కేజీబీవీ నుంచి శిరీష, శృతి హాసిని, సుధ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 19, 20, 21, 22 కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. అదే విధంగా సీనియర్ రగ్బీ ఆటలో కోసిగి కేజీబీవీ పీఈటీ సుమ మంచిగా రగ్బీ ఆడి సీనియర్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.