TG: దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు, హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధాన వైఫల్యాలే ఈ పరిస్థితులకు కారణమని అన్నారు. గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.