BPT: కర్లపాలెం దండుబాటలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ సందర్భంగా వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మరాజు పాల్గొని ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు వడ్డించారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.