HNK: ఎల్కతుర్తి మండలం కేంద్రంలోని సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AE సుధాకర్ తెలిపారు. మరమ్మతు పనులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరాను పున:రుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.