సత్యసాయి: శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తమిళనాడులోని నీలగిరి జిల్లా బాల వికాస్ పిల్లలు శనివారం రాత్రి ప్రశాంతి నిలయంలో ‘కరుణసాగర రామ’ నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. రామకథా రసవాహిని ఆధారంగా రూపొందించిన ఈ ప్రదర్శనలో అహల్య విముక్తి, జటాయువు త్యాగం, శబరి భక్తి వంటి ఘట్టాలను పిల్లలు కళ్లకు కట్టినట్లు వివరించారు.