PLD: దేవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆలయానికి ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. హుండీ కానుకలు, ప్రసాదాల విక్రయాల ద్వారా మొత్తం రూ.19,67,938లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా రూ.11.25 లక్షలు, లడ్డూ ప్రసాదం, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 8.42 లక్షలు లభించాయి. ఈవో సురేష్ సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది.