ATP: పుట్లూరు మండలం ఎల్లుట్ల యువకులు వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించారు. అటవీ ప్రాంతంలో పక్షుల కోసం నీటి సౌకర్యం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవరాశుల రక్షణకు వారు చూపుతున్న చొరవను ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి అభినందించారు. సామాజిక బాధ్యతతో స్పందించిన ఎల్లుట్ల యువతపై ప్రశంసలు కురుస్తున్నాయి.