సత్యసాయి: హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యమని ఆయన పీఏలు సురేంద్ర, వీరయ్య తెలిపారు. నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు.