AP: శ్రీశైలంలో రేపటి నుంచి 20 వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాదిమంది భక్తులు కాలినడకన పాదయాత్రగా తరలివస్తున్నారు. ఉగాది పర్వదినాన మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహన సేవలు, స్పర్శ దర్శన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు స్వామివారిని తాకి దర్శించుకునే అవకాశం కల్పించారు.