HYD: పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి అభిషేకాలు, వివిధ రకాల పువ్వులు, పండ్లు, పట్టు చీర, బంగారు ఆభరణాలతో అలంకరించారు. కుంకుమార్చన జరిపించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.