MBNR: మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం జడ్చర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 11 గంటలకు నిర్వహించే పారిశుద్ధ్య కార్య క్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ను మంత్రి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.