గద్వాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అల్లూరి ఫణి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో శాంతినగర్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కమిటీలు వేసి హిందూ ధర్మం, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.