AKP: అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం జాతర ప్రత్యేక అధికారిణిగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాతను నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు.