ప్రకాశం: పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరుకూరు గ్రామ శివారులో శనివారం పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్సై సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,010ల నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.