PPM: జిల్లాలో ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు నందమూరి కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదని, OTP, ATM పిన్ వంటి వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు అన్నారు.