NGKL: బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవనానికి స్థానిక ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ భూమి పూజ నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ః