CTR: విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ మెసేజ్లను నమ్మొద్దని ట్రాన్స్కో SE ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. బిల్లు బకాయి ఉందని, కట్ట కుంటే సరఫరాను ఆపివేయనున్నట్లు, మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ కొందరు వినియోగదారులకు సందేశాలు అందుతున్నట్లు తెలిసిందన్నారు. ఎటువంటి వివరాలైన APSPDCL అధికారుల ద్వారా తెలియజేస్తామన్నారు.