MBNR: విద్యార్థులకు చదువుతోపాటు బయటి ప్రపంచంపై అవగాహన కలిగి ఉండాలని మహబూబ్నగర్ ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ పట్టణ శివారులోని మౌంట్ బాసిల్ పాఠశాలలో నిర్వహించిన అన్యువల్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, తమ లక్ష్యాలను సాధించాలని అన్నారు.